సంపాదకీయం

జ్ఞానం-మౌనం

జ్ఞానం కూడా తనకు తాను పునరుజ్జీవితమై కొత్త చివుళ్ళు తొడగాలి, వుంటే అలాంటి జ్ఞానం వుండాలి, ఇస్తే అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. మరి అలాంటి జ్ఞానాన్ని ఎందుకు అందివ్వలేకపోతున్నాం? అటువంటి జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానంగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాం?

పిల్లలు-చదువులు

కథలు చదవని మనుషులు

అవి నా చిన్నప్పటి రోజులు. నేను ఐదో తరగతి చదువుతున్నాను. మా ఇంటి పక్కన ఒక పెద్దమనిషి ఉండేవాడు. ఆయనది మా ఊరు కాదు. ఎక్కడినుంచో వచ్చాడు. ఒంటరిగా ఉండేవాడు. వైద్యం చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన్ను అందరూ “కథల బాబాయ్” అని పిలిచేవారు.

చరిత్ర ఏమంటుంది

గ్రీసులో మలి దశ వైజ్ఞానిక వికాసం. ప్రజాస్వామ్య పుట్టుక….

గ్రీక్ ప్రకృతి విజ్ఞానులు, తొలిదశలో, ప్రకృతి కారణాలతోనే, ప్రకృతిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేశారు. అన్వేషణలో, ప్రకృతి విజ్ఞానంతో పాటు, ప్రజాస్వామ్యం వంటి సామాజిక సూత్రాల పట్ల కూడా వారి దృష్టి మళ్లీంది.

శాస్త్రజ్ఞులు

వృక్ష శిధిలాలతో చరిత్రను విశ్లేషించిన విజ్ఞాని బీర్బల్ సహా సాహ్ని

వృక్షశిథిలాలతో చరిత్ర గానాలు విశ్లేషించిన మహనీయుడు బీర్బల్ సాహ్ని! మనదేశంలో పాలియో బోటని అనగానే గుర్తుకు వచ్చే శాస్త్రవేత్త ఆయన. శిలావశేషాలలోని వివిధ పొరలలో ఉండే వృక్ష సంబంధమైన పదార్థాలను అధ్యయనం చేయడమే ‘పాలియో బోటని (Paleo Botany)’.

నమ్మకం-నిజం

కుక్క ఏడిస్తే మరణమేనా?

“కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం” అన్నారు మహాకవి శ్రీశ్రీ. కానీ మనవాళ్లు కుక్కపిల్ల, కాకి పిల్ల, పిల్లి పిల్ల కాదేది భయాలకు అనర్హమని అపోహల్లో కొట్టుకు పోతున్నారు

శాస్త్ర వికాసం

ఆస్ట్రోశాట్: ఖగోళ పరిశోధనలో భారత విజయం – దశాబ్దపు మైలురాళ్లు

విశ్వం మనకు కేవలం శాస్త్రం కాదు, ఆశ్చర్యం, ఆలోచన, స్ఫూర్తి కలిగించే అనంతమైన పాఠశాల. అటువంటి విశ్వాన్ని అధ్యయనం చేయడానికై భారతదేశం వేసిన తొలిఅడుగు, తొలి అంకితమైన అంతరిక్ష పరిశీలనశాల (అబ్జర్వేటరీ) – ఆస్ట్రోశాట్. ఇది 2025 సెప్టెంబర్ 28న విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

తెలుసుకొందాం

ప్రకృతి సూత్రాలు – పదిహేనవ సార్వత్రిక నియమము

జీవులను జీవంతో ఉంచేవి కణంలోని వివిధ జీవ భౌతిక చర్యలేనని, బహుకణ జీవుల్లో కణాలతో పాటు కణజాలాలు (tissue) కూడా కీలక ధర్మాలు నిర్వహిస్తాయని తెలిసిందే. వాటి గురించి తెలుసుకుందాం..

మంచిపుస్తకం

కొండను అద్దంలో చూపే ప్రయత్నం “సైన్సుకూ చరిత్ర వుంది”

“ఆదిమ మానవుడు జంతువుల్ని చంపి మాంసాన్ని తిన్నాక వాటి తోలును వెచ్చగా కప్పుకోవడం నేర్చుకున్నాడు. తర్వాత దానితో పాదరక్షలు చేసుకున్నాడు. దీంతో అతనికి అడవుల్లో విశాల ప్రాంతాల్లో తిరిగే సామర్థ్యం ఎంతో పెరిగింది” అంటాడు జెడి బెర్నాల్. చర్మం వాడకానికీ, మనిషి తిరగడం పెరగడానికి మధ్య ఇంత కథ వుందన్న సంగతి మన ఊహకందని విషయం.

మంచిమాట

మంచి మాట

ప్రపంచాన్ని ప్రేమించక పోతే,
ప్రజల్ని ప్రేమించక పోతే,
చదువుల్లోకి నేను ప్రవేశించ లేను!

Must Watch

మంచి మాట

సంచికలు

శీర్షికలు